టెన్షన్ వద్దు సజ్జలా... మీకు కూడా పథకాలు ఇస్తాం!: ధూళిపాళ్ల నరేంద్ర

  • టీడీపీ ప్రచారంతో వైసీపీకి భయం పట్టుకుందన్న ధూళిపాళ్ల
  • మేం ఊరూరా తిరుగుతుంటే వైసీపీకి వచ్చిన నొప్పేంటని వ్యాఖ్యలు
  • వైసీపీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా సజ్జలలో కనిపిస్తోందని వెల్లడి
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీపై టీడీపీ ప్రచారంతో జగన్ అండ్ కో కు భయం పట్టుకున్నట్టుందని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టో ద్వారా ఏమేం చేస్తామో ప్రజలకు చెప్పేందుకు మేం ఊరూరా తిరుగుతుంటే వైసీపీకి వచ్చిన నొప్పేంటి? అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. 

"ఎన్నికల హామీలపై ప్రచారం నిబంధనల ఉల్లంఘన ఎలా అవుతుంది? వైసీపీలో ఉన్న ఓటమి ఫ్రస్ట్రేషన్ అంతా ఆఫ్ నాలెడ్జ్ ఫెలో, క్యాంప్ ఆఫీసు సీనియర్ క్లర్కు సజ్జలలో కనిపిస్తోంది. మేం అధికారంలోకి రావడం ఖాయం... నువ్వు, నీ కొడుకు ఉద్యోగాలు ఊడి నిరుద్యోగులు అవ్వడం ఖాయం. టెన్షన్ వద్దు సజ్జలా... మీ అబ్బాయికి యువగళం పథకం కింద నెలకు రూ.3 వేలు ఇస్తాం. ఎలాంటి వివక్ష లేకుండా మీ కొంపకి కూడా బాబు ష్యూరిటీ పథకాలు అందిస్తాం" అంటూ ధూళిపాళ్ల నరేంద్ర వ్యంగ్యం ప్రదర్శించారు.

Dhulipala Narendra Kumar
Sajjala Ramakrishna Reddy
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News